Telugu Thesis

Subscribe to Telugu Thesis feed
తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే తెలుగు గ్రంథాలయం Download Telugu Books and Sanskrit books Freepandurangasharma ramakahttps://plus.google.com/107603709554796853189noreply@blogger.comBlogger314125
Updated: 1 week 6 days ago

పద్మపురాణం Padmapuranam

Sat, 12/09/2017 - 05:44
పద్మపురాణం- Padmapuranam 

 1. పద్మపురాణం-   Padmapuranam  (ప్రథమ భాగం)
 2. పద్మపురాణం -  Padmapuranam  (ద్వితీయభాగం)
Categories: Other Language Links

సారస్వతవ్యాసములు Sarasvata vyasamulu

Mon, 12/04/2017 - 22:29
సారస్వతవ్యాసములు Sarasvata vyasamulu

గతంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు మహత్తరమైన గ్రంథాలు ప్రచురించారు. అందులో భాగంగా సారస్వతవ్యాసములు అనే వ్యాససంపుటులను పర్చురించారు. ప్రస్తుతం ఇవి మార్కెట్టులో లభించడం లేదు. అంతర్జాలంలో లభిస్తున్నవాటిని అన్నింటిని (ప్రస్తుతం ఐదుభాగాలు)  వీలైనంతవరకు సేకరించి మీ చేతికి అందిచే ప్రయత్నం చేస్తున్నది తెలుగుపరిశోధన.
 అన్నట్టు ఈ వ్యాసపరంపరను తప్పకుండా దిగుమతి చేసుకుని, ఒకసారి చదివి చూడండి. మీకే అర్థమౌతుంది ఎంత ఉపయోగకరమైన అంశాలున్నాయో!

 1. సారస్వతవ్యాసములు Sarasvata vyasamulu
 2. సారస్వతవ్యాసములు Sarasvata vyasamulu
 3. సారస్వతవ్యాసములు Sarasvata vyasamulu
 4. సారస్వతవ్యాసములు Sarasvata vyasamulu
 5. సారస్వతవ్యాసములు Sarasvata vyasamulu
Categories: Other Language Links

పోతన భాగవతం - సార్థతాత్పర్యం Pothana Bhagavatham (Sateeka)

Tue, 11/28/2017 - 12:23
పోతన భాగవతం - సార్థతాత్పర్యం Pothana Bhagavatham (Sateeka)

తిరుమల వేంకటేశ్వరస్వామి మరొకసారి తెలుగువారిని కరుణించి తెలుగువారి దోసిళ్ళలో అమృతాన్ని ధారవోశాడు. గతంలో భాగవతాన్నంతా తాత్పర్యంతో అందించి, అంతటితో తృప్తిపడక ఆ స్వామి మనమీదగల అవ్యాజమైన, అపారమైన కరుణతో భాగవతాన్నంతా ప్రతిపదార్థసహిత వ్యాఖ్యానంతో అందించారు.అవును పోతన ఏమడిగాడు? .....
''పద్యంబొక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యమ్ము భాషింపుమా !''  - అనికదా?

అందుకే కాబోలు ఆ ఏడుకొండలవాడు అంతపనీ చేశాడు. లేక, ఈనాటి మన అజ్ఞానాన్ని పసిగట్టి ఇలాగైనా బాగుపడండర్రా! అని కాబోలు. 

ఏమయితేనేం రసికులు దిగుమతి చేసుకోండి. వీలైతే కొని పెట్టుకొండి. (అన్నట్టు, నా ప్రతిని నేను ఇంట్లో భద్రం చేసుకున్నానండోయ్!) పోతన కవితామందారమకరందమాధుర్యాలు తనివితీరా ఆస్వాదించండి.
వరుసగా ఎనిమిది సంపుటాల్లో ఉంది. ఆ యా శీర్షికపై నొక్కగానె ఆ లంకె  మిమ్మల్ని సంబంధించిన పుటకు తీసుకెళ్తుంది.
 1.  పోతన భాగవతం - సార్థతాత్పర్యం
 2.  పోతన భాగవతం - సార్థతాత్పర్యం
 3. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
 4. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
 5. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
 6. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
 7. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
 8. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
ఇక దిగుమతి చేసుకోవడమే మీవంతు. అన్నట్టు ఈ విషయాన్ని సాంఘిక సంపర్కజాలాల్లో చర్చించండి. మీ స్నేహితులూ ఈ లాభం పొందవద్దూ?

చివరగా ఒక అభ్యర్థన.
ఈ కింది నా పరిశోధననూ పరిశీలించి, మీ ఆశీస్సులు అందించగలరని ....

 శ్రీమదాంధ్ర మహాభాగవతంలో కృత్తద్ధిత ప్రయోగాలు
Categories: Other Language Links

ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు Adhunika Bhasha Shastra Siddhantalu

Mon, 09/18/2017 - 20:45
ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు Adhunika Bhasha Shastra SiddhantaluDr.పి.యస్.సుబ్రహ్మణ్యం Dr.P.S.Subrahmanyam
Dr.పి.యస్.సుబ్రహ్మణ్యం జగమెరిగిన  భాషాశాస్త్రపండితులు. వారు తెలుగులో అందించిన రెండు అపురూపగ్రంథాలు -
 1. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు
 2. ద్రావిడభాషలు
ఇందులో మొదటి గ్రంథాన్ని ఉచిత గురుకులవిద్య ఫౌండేషన్ వారు మనకు అందిస్తున్నారు. రెండవపుస్తకం అంతర్జాలంలో లభించడం లేదు.
అన్నట్టు, ఈ రెండుపుస్తకాలను తెలుగువిశ్వవిద్యాలయంవారు ముద్రించి అమ్ముతున్నారు. మీరూ ఒకప్రతి కొని పెట్టుకొండి. లేదంటే, అవి దొరకనప్పుడు బాధ పడతారు.ఈ పుస్తకాలను తెలుగు భాషాసాహిత్యాభిమానులు,భాషాశాస్త్రాభిమానులు,విద్యార్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు, ఉపాధ్యాయులు..... ఒకమాటలో చెప్పాలంటే, ప్రతి యింట ఉండదగిన అపురూప గ్రంథాలు. ఇప్పుడుమీకు  'ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు' గ్రంథాన్ని అందిస్తున్నాము. 
                                      ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు
సూచనః తెలుగులో ఎన్నో గ్రంథాలను అందిస్తూ సేవ చేస్తున్న ఉచితగురుకులవిద్య వారి ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ ని దిగుమతి చేసుకొని, పుస్తకాలను చదువుకోండి. లంకె -                        https://play.google.com/store/apps/details?id=freegurukul.org

Categories: Other Language Links

తెలుగు రామాయణాలు Telugu Ramayanalu

Tue, 09/12/2017 - 22:26
తెలుగు రామాయణాలు Telugu Ramayanalu


తెలుగులో వెలువడిన వివిధ రామాయణాలను అంతర్జాలంలో లభిస్తున్నవాటిని ఒక్కదగ్గర అందించే ప్రయత్నం లో భాగంగా ఈ టపాను మీ ముందుకు తెస్తున్నాం.

 1. రంగనాథరామాయణం
 2. మొల్ల రామాయణం
 3. ఆనంద రామాయణం
 4. ఆంధ్ర వాల్మీకి రామాయణం
 5. శ్రీ జైమినీయ రామాయణం
 6. నిర్వచనరామాయణం
 7. శ్రీ అమృతరామాయణం
 8. రమణియ రామాయణం
 9. ఆధ్యాత్మ రామాయణం
 10. గంగా రామాయణం
 11. శతకరీతి పద్యాంధ్ర సంగ్రహ రామాయణం
 12. గజల్ రామాయణం
 13. తులసి రామాయణం
 14. శ్రీ హనుమద్రామాయణం
 15. శతకంఠ రామాయణం
 16. గౌరీ రామాయణం
 17. చంపూ రామాయణము
 18. రఘురామ రామాయణం
 19. గణపతి రామాయణ సుధ
 20. లల్ల రామాయణం
 21. మల్లెమాల రామాయణం
 22. అద్భుత రామాయణం
 23. మోక్షగుండ రామాయణం

ఇవే కాకుండా  సాయి రియల్ ఆటిట్యూడ్ వారి రామాయణం లంకెలో మరికొంత సమాచారం లభించవచ్చు.
Categories: Other Language Links

తిరుపతి వేంకటకవుల రచనలు Tirupathi Venkata kavula rachanalu

Mon, 07/10/2017 - 12:00
తిరుపతి వేంకటకవుల రచనలు Tirupathi Venkata kavula rachanalu


జంటకవులుగా చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రిగారు, దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు ఆంధ్రదేశమంతా తిరిగి వెలువరించిన తమ కవితా సుగంధాలను నేటికీ ......
"బావా ఎప్పుడు వచ్చితీవు?"
 " జెండాపై కపిరాజు " 
అంటూనో తెలుగువారందరూ నేటికీ ఆస్వాదిస్తూనే ఉన్నారు.
అటువంటి తిరుపతి వేంకటకవుల రచనలు తెలుగువారందరికీ దొరికినంతవరకు పంచుకోవాలనే ప్రయత్నం తెలుగుపరిశోధన చేస్తుంది. గతంలో
శతావధానసారము  ప్రకటించాము. ఇప్పుడు ........

వారి నాటకాలు
  
 1. పాండవ జననము (1901-1917)
 2. పాండవ ప్రవాసము
 3. పాండవ రాజసూయము
 4. పాండవ ఉద్యోగము
 5. పాండవ విజయము
 6. పాండవ అశ్వమేధము
 7. అనర్ఘ నారదము
 8. దంభ వామనము
 9. సుకన్య
 10. ప్రభావతీ ప్రద్యుమ్నము (1920-1922) 


అనేవి ఒకే సంపుటంలో కలిగిన 
             1. తిరుపతి వేంకటకవుల నాటకములు
            2.  గీరతము 
          ౩.  నానారాజ సందర్శనము
         4.   కలగూరగంప
        5.  కథలూ గాథలూ
      Categories: Other Language Links

దాసోజు జ్ఞానేశ్వర్ రచనలు Dasoju Gyaneshwar Rachanalu

Mon, 07/10/2017 - 11:19
దాసోజు జ్ఞానేశ్వర్ రచనలు Dasoju Gyaneshwar Rachanalu

దాసోజు జ్ఞానేశ్వర్ గారు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో తెలుగు పండితులుగా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ కవితావ్యవసాయం చేస్తున్నారు. వారు రాసిన శ్రీదళంలో నల్గొండ జిల్లాలోని ప్రజల కష్టాలు అద్భుతంగా ఆవిష్కరించారు. అందులో ఆయన ........
"శివుడిని పార్వతి హాలాహలాన్ని మింగడానికి అనుమతించిది ఎందుకో తెలుసా?" అని ప్రశ్నించి సమాధానం ఆయనే చెబుతారు -"అందులో ఎల్లాగూ ఫ్లోరైడ్ అయితే లేదు, అయితే మరేం ఫర్లేదు" అని అట.
ఈ మాటల్లో నల్గొండజిల్లా ప్రజలు ఫ్లోరైడ్ తో ఎంతగా బాధ పడుతున్నారో వ్యంజింపజేసారు. 
వారు రాసిన కవితాసంపుటాలను తెలుగుప్రజలకు అందరికీ అందించాలని తెలుగుపరిశోధన ప్రయత్నం చేస్తున్నది.
వాటిని దిగుమతి చేసుకోవాలంటే........
1. మిన్నంటి ఎగరటానికి
2. రణగీతం
Categories: Other Language Links

తెలుగు నవలలు Telugu Novels

Thu, 05/04/2017 - 18:39

Telugu Novels Massive Collection for Book Lovers Read and Enjoy  @telugulibrary
http://t.me/telugulibrary
Madhu Babu detective Novels collection
https://app.box.com/s/eu33l8o4nj7psrszizm1mzuyhivlnrcf
Malladi Venkata Krishna Murthy Novels Collection
https://app.box.com/s/lmrf353l6yioq6kfoliypnkc0vqdhikl
Yandamuri Veerendranath Novels Collection
https://app.box.com/s/hh75fyidmqezifbuso2cj50zflmlf1ok
Yarramsetty Sai Novels
https://app.box.com/s/u24jxdewnx8xopubjipnnj7w8quhhrry
Vempalli Niranjan Reddy Novels
https://app.box.com/s/3kdq847eacwrisv5wa3w3psuomxoq2rc
Syambabu Novels
https://app.box.com/s/brbtjimej1e6f8bvbr3diq27znixl43j
Chanadamama Monthly 1950 to 2000 month wise in telugu
https://app.box.com/s/zzyai70lx7igc9xkuz2v
Mayamayi by Bolanath
https://app.box.com/s/tngcw1uyn78h2sp8rksv
Suryadevara Ram Mohan Rao Novels
https://app.box.com/s/5078odok5fjd9odezq0qvo3uo4x5vurv
Panuganti Detectives Novels
https://app.box.com/s/c7xzirjei9r2da7dem34k65rmgpgnnp9
NR Nandi Novelshttps://app.box.com/s/spi1t1itxy3xhne2pph0m3olklu2lh6r
Mynampati Bhaskar Novels
https://app.box.com/s/ge6owm24spqn1476zyp3iemd1h56h22g
Mudigonda Sivaprasad Novels
https://app.box.com/s/u2epmowde4hrgqx1cvz4r7gmj7ui2yps
Merlapaka Murali Novels
https://app.box.com/s/xyh7ylnr7bzpsbwx7z4rm2bhitb25wtk
GV Amereswara Rao Novels
https://app.box.com/s/iglq0j5q1265ojas33nd182411l61jih
Dr. Smaram Novels
https://app.box.com/s/kh4lxmea730vuamt57q4ovvt26uwrgqh
Dr. Kirankumar Novels
https://app.box.com/s/dnbuew1rt0uhu2vip3tv58v7vjrc26cx
Chandu Sombabu Novelshttps://app.box.com/s/g7llbpactop8vvpmdhmw125ikxkq350j
Challa Subrahmanyam Novels
https://app.box.com/s/3uvqt2kzisx2zh1ks7xsc8un39nk7k21
Chalam Novels
https://app.box.com/s/awhnot0v32aavu27i8se5qbhuyd64l1y
C Anandaramam Novels
https://app.box.com/s/c31slfod968tanzp20dcsup8i5lx1cfh
Bollimunta Nageswara Rao Novels
https://app.box.com/s/8cgo5xqefstdaymambyb10nomg2utrac
Bapu and Ramana Novels
https://app.box.com/s/7rh0u4a2py99lzrdcvtf2o6ihxv9pkqi
Balabhadra Patruni Ramani Novels
https://app.box.com/s/7v2c61nxtvmwihr3o36d7256uwk9i698
Auto Biography's
https://app.box.com/s/4qxxyvjekfe3qtvmz124f13a8fa4hx8q
Akki Peddi Novels
https://app.box.com/s/71zuduq9gk9kkhfaac9dfcyx3bqzfsa9
Different Writers Novels
https://app.box.com/s/c6zvh3fpgv4v3i5a96z8x8jv0ce3rmt8

Different Writers Novels Part II
https://app.box.com/s/52unmql3jcfcg8l6hmi7bo65aiues1xz
@telugulibrary@Ravi
Thanks to V.Ravi Kumar for these links with us.
Categories: Other Language Links

కూచిమంచి తిమ్మకవి రచనలు Kuchimanchi Timmakavi Rachanalu

Tue, 03/28/2017 - 17:49
కూచిమంచి తిమ్మకవి రచనలు Kuchimanchi Timmakavi Rachanalu

       కూచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దపు తెలుగు కవి. తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు మూడవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు.
ఈయన రచనలు  -
రచనలు కొన్ని లభిస్తున్నాయి, చదవండి........
 1. అచ్చతెలుగు రామాయణము
 2. సీతామనోహరం
 3. రుక్మిణీ పరిణయము (1715)
 4. సింహాచల మహాత్మ్యము (1719)
 5. నీలాసుందరీ పరిణయము
 6. సారంగధర చరిత్ర
 7. రాజశేఖర విలాసము (1705)
 8. రసికజన మనోభిరామము (1750)
 9. సర్వలక్షణసార సంగ్రహము (1740)
 10. సర్పపురీ మహాత్మ్యము (1754)
 11. శివలీలా విలాసము (1756)
 12. కుక్కుటేశ్వర శతకము
 13. శ్రీ భర్గ శతకము (1729)
 14. భర్గీ శతకము
 15. చిరవిభవ శతకము
Categories: Other Language Links

శివసంబంధ గ్రంథాలు, తదితర సాహిత్యం

Fri, 02/17/2017 - 19:26పరమాత్మ స్వరూపమునకు నమస్కారాలు,

 

మహాశివరాత్రి సందర్భంగా పరమశివుని సంబంద  ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను, 

ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది, తద్వారా పరమశివుని పై భక్తి,ప్రేమ, విశ్వాసం ను మరింత వృద్ది

చేసుకోగలరని ఆశిస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,

మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని  ఆశిస్తున్నాము. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము 

కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము.

 

 ప్రవచనాలు:-

   

శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ అష్టోత్తర నామ స్తోత్రం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015శివ తత్వముసుందర చైతన్య స్వామిశివ పంచాక్షర స్తోత్రం - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2015శివ తత్వముపరిపూర్ణానంద సరస్వతి స్వామిశివరాత్రి - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే  ప్రవచనంశివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ పురాణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివపదం-కీర్తనలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ-బాలకృష్ణ ప్రసాద్ గారితో-2013శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మమహాభారతంలో శివ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ పరివారం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుపరమశివ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ దర్శనము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ మహిమలు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ తత్వము - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ పార్వతి కళ్యాణ వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ శక్తి  వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ పార్వతి వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివ లింగ తత్వము -శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ-శక్తి పీఠ రహస్యాలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశ్రీశైలం-శివ మహిమ -శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ లీలామృతం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనంశివ తత్వముసామవేదం షణ్ముఖ శర్మశివ కర్ణామృతం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2016శివ తత్వముచాగంటి కోటేశ్వరరావుశివభక్తి-శరణాగతి  - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుశ్రీశైల మహత్యం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాశీ రామేశ్వరం విశిష్టత - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాళహస్తీశ్వర వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014పుణ్యక్షేత్రాలువద్దిపర్తి పద్మాకర్రామేశ్వర మహత్వం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013పుణ్యక్షేత్రాలుసామవేదం షణ్ముఖ శర్మచిదంబర రహస్యం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013పుణ్యక్షేత్రాలువద్దిపర్తి పద్మాకర్కాశీ వైభవం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015పుణ్యక్షేత్రాలువద్దిపర్తి పద్మాకర్అరుణాచల మహత్యం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాశీ యాత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-1 వ భాగం-2014పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాశీ యాత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2 వ భాగం-2014పుణ్యక్షేత్రాలువద్దిపర్తి పద్మాకర్ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాశీ విశ్వనాధ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-1వ భాగం-2010పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుకాశీ విశ్వనాధ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2వ భాగం-2010పుణ్యక్షేత్రాలుచాగంటి కోటేశ్వరరావుఅరుణాచల మహత్యం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012భక్తులుచిర్రావూరి శివరామకృష్ణ శర్మ శివ భక్త విలాసం - శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారిచే ప్రవచనంభక్తులుసామవేదం షణ్ముఖ శర్మశివభక్త కథాసుధ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013భక్తులుగరికిపాటి నరసింహారావుభక్త కన్నప్ప - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2014శతకాలుచాగంటి కోటేశ్వరరావుకాళహస్తీశ్వర శతకం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014పండుగలుసామవేదం షణ్ముఖ శర్మకార్తీక మాస శివ ఆరాధన - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015శివ తత్వము శివ సంబంద ధర్మ సందేహాలు 


గ్రంధాలు:-

వర్గం
-----రకం
-----రచయిత,అనువదించిన వారు
----------------------------------చదువుటకు,దిగుమతి లింక్
-----------------------------------పేజీలు 
---------భక్తులువచనమద్దూరి వెంకట సుబ్బారావుపెరియ పురాణం - 63 నాయనార్ల పరమ పావన గాధలు165భక్తులువచనఅమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులుశివదీక్షాపరులు40పురాణములువచనక్రోవి పార్ధసారధిశివ పురాణము125పురాణములువచనN/Aశివ పురాణం451పురాణములుపద్యముదిగొండ నాగవీరేశ్వరశివ పురాణం844పురాణములువచనవోలేటి వేంకటలక్ష్మీనృసింహశర్మమార్కండేయ పురాణం360పురాణములువచనN/Aసంపూర్ణ కార్తీక మహాపురాణం133కథలువచననాగశ్రీబాలానంద కాశీరామేశ్వర మజిలీల కథలు87ఉపనిషత్తులుపద్య+తాత్పర్యనిర్మల శంకర శాస్త్రిశివ తత్వ ప్రభాంద్రీకరణం-1237ఉపనిషత్తులుపద్య+తాత్పర్యనిర్మల శంకర శాస్త్రిశివ తత్వ ప్రభాంద్రీకరణం-2214గీతలుపద్య+తాత్పర్యపెద్దమటం రాచవీర దేవరశివ గీత375గీతలుపద్య+తాత్పర్యలొల్ల రామచంద్రరావుశివ గీత-శివ రాఘవ సంవాదం139దేవిదేవతలుపద్య+తాత్పర్యబ్రహ్మాండం వేంకటలక్ష్మినారాయణశివతాండవం117భక్తి యోగంపద్య+తాత్పత్యగణపతి దేవుడుశివ యోగ సారము-2108భక్తి యోగంవచనవెంకట సూర్యనారాయణమూర్తిశివ లీలామృతము392పూజవచనఅద్దేపల్లి కృష్ణ శాస్త్రిశివార్చన73పూజవచనచొప్ప వీరభద్రప్పశివదృష్టి116పూజ ఆదిపూడి వేంకటశివసాయిరామ్శివ ఆరాధన148పూజవచననటరాజ రామకృష్ణఅమ్మ-శివరాత్రి,శివ తాండవం52పూజవచనలవ్వారి సుబ్రహ్మణ్యశర్మరుద్రాక్షాది మాలలు - ఫలములు105పూజవచనవేద వ్యాసశివ పూజ రహస్యాలు-1261మంత్రాలు నిర్మల శంకరశాస్త్రిప్రణవ శివ షడక్షరీ మహామంత్ర ప్రసస్థ్యము47స్తుతి,ప్రార్ధనపద్య+తాత్పర్యవీరభద్రశర్మశివ పంచస్తవి355స్తోత్రాలుస్తోత్రం+తాత్పర్యనిర్మల శంకరశాస్త్రిశివ మహా స్తోత్రము-అర్థ సహితము76స్తోత్రాలుస్తోత్రం+తాత్పర్యజ్ఞానానంద తీర్ధ స్వామిశివ మహిమ్న స్తోత్రము121స్తోత్రాలుస్తోత్రం+వచనగాయత్రి బాబాశివ సహస్ర నామ స్తోత్ర వివరణము203స్తోత్రాలువచనపవని సీతారామయ్యశివ సహస్ర నామ స్తోత్ర వ్యాఖ్యానము181స్తోత్రాలుస్తోత్రం+వచనపేరూరు కూర్మయ్యశివ స్తోత్రామృతము40స్తోత్రాలుస్తోత్రంకాశీభట్ట కృష్ణరాయ శాస్త్రిశివామృతం20స్తుతి,ప్రార్ధన అమిరపు నటరాజన్ప్రార్ధనలు నిజంగా పనిచేస్తాయా220స్తోత్రాలుస్తోత్రం+తాత్పర్యబేతపూడి లక్ష్మి కాంతంశివ మహిమ్న స్తోత్రం50


పాటలు:-

శివ భక్తి పాటలుShivaranjaniMusic - శివ భక్తి పాటలు శివ భక్తి పాటలుAdityaDevotional - శివ భక్తి పాటలు శివ భక్తి పాటలుMy3BhakthiSongs - శివ భక్తి పాటలు శివ భక్తి పాటలుMy3Music - శివ భక్తి పాటలు శివ భక్తి పాటలుMyBhaktiTV - శివ భక్తి పాటలు శివ భక్తి పాటలుTelanganaDevotional - శివ భక్తి పాటలు 


సినిమాలు:-

భక్తి సినిమాలుకాళహస్తి మహాత్యం - భక్తి సినిమాభక్తి సినిమాలుశ్రీ మంజునాధ - భక్తి సినిమాభక్తి సినిమాలుభక్త సిరియాళ - భక్తి సినిమాభక్తి సినిమాలుభక్త శంకర - భక్తి సినిమాభక్తి సినిమాలుభక్త కన్నప్ప - భక్తి సినిమాభక్తి సినిమాలుభక్త మార్కండేయ - భక్తి సినిమాభక్తి సినిమాలుభక్త దృవ,మార్కండేయ - భక్తి సినిమాభక్తి సినిమాలుదక్షయజ్ఞం - భక్తి సినిమాభక్తి సినిమాలుశివ పార్వతి(యానిమేషన్ సినిమా-ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమాభక్తి సినిమాలుశివ భక్త విజయం - భక్తి సినిమాభక్తి సినిమాలుమహా శివరాత్రి - భక్తి సినిమాసీరియల్:-

భక్తి సీరియల్ETV - శివ లీలలు - భక్తి సీరియల్ - 1వ భాగంభక్తి సీరియల్ETV - శివ లీలలు - భక్తి సీరియల్ - 2వ భాగంభక్తి సీరియల్T-Series-శివ మహా పురాణం - సీరియల్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) -1వ భాగంభక్తి సీరియల్T-Series-శివ మహా పురాణం - సీరియల్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) -2వ భాగం


లేక

http://www.sairealattitudemanagement.org/Shiva

లేక

pdf కూడా జతచేసాము..

సదా సాయినాధుని సేవలో,

సాయి రామ్ సేవక బృందం

 

3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ ఆప్:https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books

P

Categories: Other Language Links

తెలుగు నాటక వికాసం Telugu NaTaka vikasasam

Sat, 01/21/2017 - 22:56
తెలుగు నాటక వికాసం Telugu NaTaka vikasasamపోణంగి శ్రీరామ అప్పారావు Ponangi Sri Rama Appa Rao

పోణంగి శ్రీరామ అప్పారావు నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.అప్పారావు 1923 జూలై 21 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురంలో జన్మించాడు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, విజయవాడ శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను విద్యాభ్యాసం చేశాడు. ’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.అప్పారావు వృత్తిరీత్యా అధ్యాపకుడు. భీమవరంరాజమహేంద్రవరంమద్రాసుకడప, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీల్లోనూ, మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలోనూ కొంతకాలం ఉపస్యాసకుడిగా పనిచేశాడు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం లోను పాఠ్యగ్రంథ జాతీయకరణ ప్రత్యేకోద్యోగిగా పనిచేశాడు.అప్పారావు 1987 లో కలకత్తాలో జరిగిన విశ్వ ఉన్నయన్ సంసద్లో రాష్ట్ర నాట్య సామ్రాట్ బిరుదును, 1990లో హైదరాబాదు యువ కళావాహిని వారిచే నాటక రత్న బిరుదాన్ని, 1992 లో శ్రీకాళహస్తి భరతముని ఆర్ట్స్ అకాడెమీ వారిచే కళారత్న బిరుదాన్ని అందుకున్నాడు.[1]భరతముని ‘నాట్యశాస్త్రం’ను తెలుగులో అనువదించి ప్రపంచానికి అందించాడు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇతర రచనలు తాజ్ మహల్ (నాటిక), విశ్వభారతి (నవల), వేణువు (పద్యాత్మక గద్యము), నాట్యశాస్త్రము (గుప్తభావప్రకాశికాసహితము-జాతీయ బహుమతి పొందన గ్రంథం), నాటకరచనాప్రయోగములు (సిద్ధాంత గ్రంథము), తెలుగు నాటక వికాసము (డాక్టరేట్ పట్ట పరిశోధన వ్యాసము) నాటకరంగ పరిశోధనలో విశేషంగా కృషిచేసిన అప్పారావు 2005, జూలై 2న కన్నుమూశాడు.
To Download...........తెలుగు నాటక వికాసం Telugu NaTaka vikasasam
Categories: Other Language Links

నీరాజనార్చన(మంగళహారతులు) Nirajana Archana( Mangala haratulu)

Thu, 11/17/2016 - 19:36
నీరాజనార్చన(మంగళహారతులు) Nirajana Archana( Mangala haratulu)

శ్రీనారసింహీ గురుస్థానము, చుంచనకోట వారు దేవపూజలలో పాడే మంగళహారతులను సంకలనం చేసి `నీరాజనార్చన' పేరిట ప్రచురించారు. ఈ విషయంలో శ్రమకోర్చిన దేశపతి లలితామతి శర్మ గారు అభినందనీయులు.
బ్రహ్మశ్రీ విఠాల చంద్రమౌళి శస్త్రి గారిచే చుంచనకోట లో భువనేశ్వరీ దేవి ప్రతిష్టించబడింది. ఆ యమ్మ మనలను ఈ విధంగా అనుగ్రహించడం మన అదృష్టం.

 ఇదే విధంగా చంద్రమౌళి శాస్త్రిగారి రచనలన్నిటిని, వారిచే సంకలనం చేయబడిన శ్రీచక్రార్చనాక్రమం కూడా  ఆ అమ్మ అనుగ్రహిస్తే సాధకలోకానికి మేలు జరుగుతుంది.
(ఈ పుస్తకం whatsapp Group లో లభించింది.)దిగుమతి కొరకు......నీరాజనార్చన(మంగళహారతులు) Nirajana Archana( Mangala haratulu)......పై నొక్కండి.


Categories: Other Language Links

కాళోజీ రచనలు Kaloji Rachanalu

Wed, 11/09/2016 - 10:00
కాళోజీ రచనలు
 Kaloji Rachanalu
Kaloji Narayan Rao

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ.
 ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి
 అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’
- అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.


           తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-
                             సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
           అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-                            సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా
అని మనలను ఏనాడో హెచ్చరించిన సిసలైన తెలుగోడు కాళోజీ.


ఆయన రచనలన్నీ దొరికితే (ఇంటర్ నెట్ లో) బాగానే ఉండు. కానీ లాభం లేదు. దొరుకవు. ఏవో ఒకటి రెండు పుస్తకాలు దొరుకుతున్నయి. ఈ-తెలంగాణ వాళ్ళు అందిస్తున్నరు. మీకు వీటి రుచి తెలుపాల్నని అందిస్తున్న.

ఈ పుస్తకాలు దించుకోను లంకెలు .........
 1. నా గొడవ
 2. తెలంగాణ భాష - బతుకు
 3. కాళోజీ కథలు
 4. కాళోజీ కవితలు
పేర్వారం జగన్నాథం రాసిన ........
         కాళోజీ
Categories: Other Language Links

తెలంగాణ పదకోశం-నలిమెల భాస్కర్ Telangana Padakosham - Nalimela Bhaskar

Tue, 11/08/2016 - 09:48
తెలంగాణ పదకోశం-నలిమెల భాస్కర్ 

Telangana Padakosham - Nalimela Bhaskar


Telangana Padakosham

నలిమెల భాస్కర్ సేకరించిన తెలంగాణ పదకోశాన్ని http://etelangana.org వారు అందిస్తున్నారు. ఆ అపురూపమైన పదకోశాన్ని తెలుగువారి దృష్టికి తేవాలనేదే మా ప్రయత్నం.

ఆ పుస్తకాన్ని దిగుమతి చేసుకుని ఆనందించండి.
తెలంగాణ పదకోశం-నలిమెల భాస్కర్ Telangana Padakosham - Nalimela Bhaskar

Categories: Other Language Links

కృష్ణశాస్త్రి రచనలు Krishna Shastri Rachanalu

Sun, 10/30/2016 - 19:41
కృష్ణశాస్త్రి రచనలు Krishna Shastri Rachanalukrishna shastri
ప్రసిద్ధ కవి,రచయిత శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి రచనలను లభించినంత మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.ఎప్పటిలానే మా ఈ ప్రయత్నమూనూ మీకు నచ్చి తీరుతుందనీ, మళ్ళీ ఎప్పటిలానే మీమీ సాంఘికసంపర్కజాలాల్లో బహుళప్రచారప్రసారాలతో ఈ టపాను ఆదరిస్తారనీ ఆశిస్తున్నాము.


1.దేవులపల్లి కృష్ణశాస్త్రి కృతులు      (కృష్ణపక్షము,ప్రవాసము,ఊర్వశి)2. అమృతవీణ (గేయాలు)3. శర్మిష్ఠ (గేయ/శ్రవ్య నాటికలు)4.కృష్ణశాస్త్రి బదరిక5.అరుణరథం 6.బహుకాల దర్శనం (తదితర నాటికలు)7. కృష్ణశాస్త్రి గేయసంహిత 2 (మంగళకాహళి)8. పుష్పలావికలు (తదితర వ్యాసాలు)9.కృష్ణశాస్తి వ్యాసావళి 110.కృష్ణశాస్త్రి వ్యాసావళి - 311.కృష్ణశాస్త్రి వ్యాసావళి 412.కృష్ణశాస్త్రి పద్యాలు (పల్లకీ)13. శ్రీవిద్యాపతి (తదితర నాటికలు)14. గోరింట (సినిమా పాటలు)15. ధనుర్దాసు (మొ. నాటికలు)16. అప్పుడుపుట్టిఉంటే (మొ.వ్యాసాలు) 
Categories: Other Language Links

ఆంధ్ర వాఙ్మయారంభ దశ Andhravangmaya Arambhadasha

Tue, 08/30/2016 - 22:18
ఆంధ్ర వాఙ్మయారంభ దశ  Andhravangmaya Arambhadasha


ఈ రెండు భాగాల దివాకర్ల వేంకటావధానిగారి పరిశోధనాగ్రంథం ప్రాఙ్నన్నయ యుగం గురించి విపులంగా చర్చించడమే కాక భారతావతరణాన్నీ స్పృశిస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టం కొరకు సమర్పించిన తొలితరం పరిశోధనాగ్రంథం. అపురూపమైన సంప్రదింపు గ్రంథం.దిగుమతి కొరకు ........

     ఆంధ్ర వాఙ్మయారంభ దశ -ప్రాఙ్నన్నయ యుగం ౧     ఆంధ్ర వాఙ్మయారంభ దశ - నన్నయ భారతము  ౨
తప్పక దిగుమతి చేసుకోండి, చదవండి.
Categories: Other Language Links

Dr.అంబడిపూడి నాగభూషణం రచనలు Dr.Ambadipudi Nagabhushanam

Sun, 08/28/2016 - 19:12
Dr.అంబడిపూడి నాగభూషణం రచనలు Dr.Ambadipudi Nagabhushanam

ప్రసిద్ధ వ్యాకరణశాస్త్ర పండితులు, భాషాశాస్త్రవేత్త, ఆచార్యులు అంబడిపూడి నాగభూషణంగారి వ్యాకరణ రచనలు లభిస్తున్నాయి. వాటిని చదవడంవల్ల మన భాషా జ్ఞానం పెరుగుతుంది. చక్కని సంప్రదింపు గ్రంథాలు. దిగుమతి చేసుకుని, ఆనందించండి.

 1. ప్రౌఢవ్యాకరణ దిగ్దర్శిని
 2. బాలవ్యాకరణ సూక్తులు ౧
 3. బాలవ్యాకరణ సూక్తులు ౨
 4. బాలవ్యాకరణసూక్తులు 
 5. బాలవ్యాకరణము -అర్థదీపికావ్యాఖ్య
 6. బాలప్రౌఢవ్యాకరణ దిగ్దర్శిని
 7. ద్రుతస్వరూపాన్వేషణము
 8. ద్రుతప్రకృతికావలోకనము
 9. ద్రుతకార్యానుశీలనము
 10. బాలవ్యాకరణ వికాస వివేచనము
 11. త్రిలింగశబ్దానుశాసనము
 12. సారస్వత త్రిలింగ శబ్దానుశాసనము
 13. ప్రౌఢవ్యాకరణ వ్యాఖ్యానుశీలనము ౧
 14. ప్రౌఢవ్యాకరణ వ్యాఖ్యానుశీలనము ౨
 15. ఆంధ్రశబ్దకౌముది వ్యాఖ్య
 16. బార్హస్పత్యసూత్రాణి వ్యాఖ్య
Categories: Other Language Links

ఆంధ్ర వాల్మీకి రచనలు Andhra Valmiki Rachanalu

Sat, 08/20/2016 - 19:30
ఆంధ్ర వాల్మీకి రచనలు Andhra Valmiki Rachanalu 


వాసుదాసుయై యవతరించి శ్రీరామాయణమును తెనిగించి బండ్ల కెక్కించి లోకోద్ధరణ మొనరించి తమ 73 ఏట పరమవదించిరి. ఆయనే వాసుదాసు అన్వర్థ నామ ధేయుడై శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు – ఆంధ్రవాల్మీకిబిరుదాంకితులు – శ్రీ కోదండ రామ సేవక సమాజ సమాజ సంస్థాపనాచార్యులు – ఆంధ్ర వాల్మీకి రామాయణ శ్రీ కృష్ణ లీలామృత ద్విపద భగవత్ గీతాది బహుగ్రంధ కర్తలు ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధారకులు భక్తి మత ప్రచారకులు – మహర్షి – మౌని – అకుంఠిత రామభక్తుడు – తత్త్వ వేత్త – వక్త – విమర్శకులు.
ఇంకా ఊలపల్లి సాంబశివ రావు గారు ఇలా తెలుపుతున్నారు........    ''వీరు వాసుదేవ స్వామిగా బహుథా ప్రసిద్ధులు. మహా సాధకులు,    పోతన జీవిత ఆదర్శాలతో 19-20 శతాబ్దాలలో జీవించిన మహానుభావుడు . .  కాలం మరుగున ఉండిపోయిన పండిత శ్రేష్ఠ తముడు. . .  
శ్రీ శ్రీ శ్రీ  వాసుదేవ స్వామి, కడప, (వావికొలను వారు) సాహిత్యాన్ని లక్ష్మీనారాయణగారు ప్రాచారం చేస్తున్నారు.మీకు తెెలిసిన విషయమే వాసుదేవ స్వామివారి గొప్పదనం. వారు  మహర్షి. వారు ప్రచురించిన  ఆధ్యాత్మిక గ్రంథాలు అనేకం ఉన్నాయి.వాటిని ప్రచారంచేసే కార్యం బుజాన వేసుకున్న మహానుభావులు శ్రీ లక్ష్మీనారాయణగారు కడపలో ఉంటారు.వారి పుస్తకాలు ఉన్న వారి జాలగూడులో పెట్టారు.మీరు అవకాశం చూసుకుని వారి గ్రంథాలను అందించి ప్రచారం కల్పించండి. మన తెలుగుభాషకు సంప్రదాయాలకు ఎంతో మేలు జరుగుతుందండి. . .'' అని.


మరి పెద్దల మాట చద్దన్నం మూట కదా? తప్పక ఆ జాలగూటిని సందర్శించండి. దాని చిరునామా........                                  http://www.andhravalmiki.org/literature/  
Categories: Other Language Links

శ్రీపాద కామేశ్వర్ రావు రచనలు SriPada Kameshwar Rao

Thu, 07/14/2016 - 09:30
శ్రీపాద కామేశ్వర్ రావు రచనలు SriPada Kameshwar Rao

శ్రీపాద కామేశ్వర్ రావు గారి రచనలు ఇక్కడ కొన్నింటిని సంగ్రహిస్తున్నాము.

 1.          తగిన శాస్తి
 2.          లీలావతీ సులోచనాలు
 3.          సాహిత్య మీమాంస
 4.          చంద్రగుప్త
 5.          శ్రీమాధవా చార్య విద్యారణ్య స్వామి
 6.          పిసినిగొట్టు
 7.          భారత రమణి
 8.          పునర్వివాహము       Categories: Other Language Links

భమిడిపాటి కామేశ్వర్ రావు రచనలు Writings of Bhamidipati Kameshwar Rao

Wed, 07/13/2016 - 10:00
భమిడిపాటి కామేశ్వర్ రావు రచనలు Writings of Bhamidipati Kameshwar Rao
Bhamidipati Kameshwar Rao

భమిడిపాటి వారి రచనలు అంతర్జాలంలో కొన్ని లభిస్తున్నాయి. వాటిని ఒక్క దగ్గర చేర్చే ప్రయత్నమే ఇది.

 1. బాల కేసరి
 2. చెప్ప లేము
 3. వినయ ప్రభ
 4. వసంత సేన
 5. రెండు రెళ్ళు మూడు - ఆటలు
 6. నిజం కూడా అబద్ధమే
 7. లోకో భిన్న రుచి
 8. ఆంధ్ర నాటక పద్య పఠనము
 9. పెళ్ళి ట్రెయినింగ్
 10. మాట వరుస
 11. మాయల లోకం
 12. తనలో
 13. గంగ
అన్నట్టు.... మీకెవరికైనా, ఇంకేవైనా లంకెలు దొరికితే తెలుపండి. నలుగురితో పంచుకోవచ్చు. 
Categories: Other Language Links

Pages