Telugu Thesis

Subscribe to Telugu Thesis feed
తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే తెలుగు గ్రంథాలయం Download Telugu Books and Sanskrit books Freepandurangasharma ramakahttps://plus.google.com/107603709554796853189noreply@blogger.comBlogger312125
Updated: 1 week 4 days ago

నోరి నరసింహ శాస్త్రి రచనలు Writings of Nori Narsimha Shastri

Sun, 07/10/2016 - 16:19

నోరి నరసింహ శాస్త్రి రచనలు Writings of Nori Narsimha Shastri


నోరి నరసింహశాస్త్రి (1900 - 1978) ప్రముఖ తెలుగు కవి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభినివేశాన్ని సంపాదించుకున్న మనీషులు. సాహిత్య శాస్త్రవలోకనంలో, ప్రాచీనాంధ్ర కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక అధ్యయనంలో, నవ్య సాహిత్య సమీక్షలో శ్రీ శాస్త్రిగారు గంభీరమయిన పరిశ్రమ చేసినవారు. సాహిత్యోద్యమంలో అగ్రేసరులు.
వీరి గ్రంథాలు కొన్ని........


 1.    నారాయణ భట్టు
 2.   రుద్రమదేవి
 3.   కవిద్వయము
 4.   సారస్వతవ్యాసములు
 5.   సోమనాథ విజయము
 6.   వాఘీరా
 7.   సర్పశాస్త్రం
 8.   తేనెతెట్టె
 9.   ధ్యాన యోగం
 10.   భాగవతావతరణము (పద్య నాటిక)
 11.   దేవీభాగవతం (1,2,3 స్కంధములు)
 12.   ऐतिहासिक उपन्यास
Categories: Other Language Links

ఆంధ్రపత్రిక - స్వర్ణోత్సవ సంచిక Andhra Patrika Svarnotsava Sanchika

Sat, 06/11/2016 - 10:15

ఆంధ్రపత్రిక - స్వర్ణోత్సవ సంచిక Andhra Patrika Svarnotsava Sanchika
దాదా హయాత్ గారు తెలిపారు .......వేమూరి విశ్వనాథ శర్మ గారు, ఎం.ఏ., ఎల్.టి., యెవరో మనకు తెలీదు. నాకూ తెలీదు. వారు 1925 నాటికి నలభై వుత్తరాలు సేకరించారు. అవి అప్పటికే నూటయాభైసంవత్సరాలనాటివి. తంజావూరు రాజ్య వాస్తవ్యులకు సంబంధించిన తెలుగు వుత్తరాలు. ఇప్పుడు తమిళం ప్రధాన భాషగా వున్న తంజావూరు ప్రాంతంలో ఒకప్పుడు తెలుగేప్రధానభాషగా అందరూ వాడేవారని నిరూపించడానికి వాటిలో మచ్చుకు కొన్ని వుత్తరాలు వారు 'ఆంధ్రపత్రిక ' 1925 క్రోధన సంవత్సరాది సంచికలో 'దక్షిణాది తెలుగు; కొన్ని పాత వుత్తరాలు ' అనే పేరుగల వ్యాసంలో ప్రకటించారు.
వాటిలో ఒక శుభలేఖ చూడండి - "శ్రీమత్సమస్త సద్గుణసంపం న్న అఖండ్డిత లక్ష్మీ సేవా ప్రసం న్న అవ్యాజ పరోపకార అనేక ధర్మ పరిపాలక స్నేహిత పరిపూర్ణ వాత్సల్యమహం మ్మేరు సమాన ధీరులయ్ని మహారాజశ్రీ సంబ్భాజీ శివరావు వారికి,- శే|| వైద్యలింగ్గం సాష్టాంగ దండములుబెట్టి శాయంగల విం న్నపాలు యిచ్చట ఆవణి నెల 20తేదీ వర్కు కుశలం తమ నిరంత్తర సకల సంత్తోష సాంబ్రాజ్య అతిశయములకు వ్రాయించ్చి పంపిస్తూ రావలెను. త|| ఈనెల 24 తేది భానువారం దినమందు ధనుర్లగ్నమునచిరంజ్జీవి తం మ్ముడు శివచెదంబ్బరానికి వివాహముహూర్తం నిశ్చయమై వుం న్నది గన్క యింత్త పరియంత్రం విజయం చేసి ముహూర్తం నెఱవేర్చి యిప్పించేలాగ్నుశాయవలెను తాము అభిజ్ఞులు గన్క విశేషించ్చి వ్రాసుకోగలది లేదు గదా కడమ యిచ్చట నడ్వగల ప్రయోజనములంకున్ను అచ్చటి సుభోదయములంకుం న్ను వ్రాయించ్చిపంపిస్తూ రావలెను యింతే దండ్డములు."తంజావూరు రాజు అమరసింహునికి పుదుచ్చేరి నవాబుగారు రాసిన జాబు చూడండి - "షహామతు అవాలిమర్త బతుషవుకతు వమాలీ మంజులతు మలాజు మెహెరుబాన్మొకర్రం మొకలీసాన్ మహారాజ అమరశింహ్మరాజే సల్లమల్లహుతాలా. మేముం న్నూ ఖుషీని వుం న్నాము. మీ ఖుశాలినామా హమేశా వ్రాయించ్చి పంప్పింస్తూరావలెను........."     ఇలాంటివి కాక శృంగేరి స్వామి శ్రీముఖం, అమరసింహుడు శంకరాచార్యులకు రాసిన వుత్తరాలు పొడవాటివే వీటిలో వున్నాయి. నాటి వాడుక భాషలోని అనేక పదాలుఇప్పటికీ మనం వాడుతున్నాం.ఒక మహారాజుగారి "పుష్పగంధ కస్తూరి పం న్నీరు పరిమళాదుల చాత పూజ చాయపడినషువంట్టి పాదపద్మములకు" వెంకటరాఘవు అనే వేశ్య రాసిన అపూర్వమైనప్రేమలేఖ ఒకటి గద్యపద్యాలలో ఇందులో వుంది. అందులో చాలావరకు వాడుకభాషలో వున్న సీసపద్యం చూడండి-
సీ. వుండ్డుండ్డి యేమేమొ వూరకె చింత్తింత్తు                చింత్తించ్చి నాలోనె చిం న్న బోదు     చిం న్న బోయి యొకింత్తశేపు తెలివిగ నుంద్దు                తెలివి వ్యాళను మిం మ్ము తలపువచ్చు     తలచినంత్తనె వచ్చి నిలచినట్లనె తోచు                తోచిన నే దిగ్గున లేచి జూతు     జూచి వేగమె బార జాచి కౌంగిట గృత్తు                గృచ్చి కౌంగిట లేక వెచ్చనూర్తు     వెచ్చనూర్చియు తపియింత్తు వెతల నింత్తు     సఖుల గద్దింత్తు తెగువ యోచన తలంత్తు     నీదు మనసెంత్తు అంత్త నం న్నియు శమింత్తు     భవ్యగుణహారి వేణుగోపాల శౌరీ.
-తెలుగు అజంత భాష కావడంతో కుదిరిన అపురూప పదవిన్యాసమిది. బహుశా క్షేత్రయ్యకు ఛాయ కావచ్చు.'ఆంధ్రపత్రిక ' వారు 1964-65 నాటి విశ్వావసు సంవత్సరాదికి తమ స్వర్ణోత్సవ సంచిక ప్రకటించారు. ఆ సంచికలో ఇదిగో వేమూరి విశ్వనాథ శర్మగారి ఈ అపురూపమైనవ్యాసాన్ని పునర్ముద్రించారు.ఇంకా ఈ సంచికలో మనం గుర్తుంచుకోవలసినవారే కానీ, గుర్తించకుండా వదిలేసిన అనేకమంది మహానుభావులతో పాటు లబ్ధప్రతిష్ఠులైనవారి రచనలనేకం - అదివరకు'ఆంధ్రపత్రిక ' లో వచ్చినవి - మళ్ళీ వేశారు. వాటిలో కూడా మనం గుర్తుంచుకోవలసినవే కానీ, గుర్తించకుండా వదిలేసిన రచనలనేకం వున్నాయి. మంచి రచన చేసిన ప్రతిఒక్కర్నీ - మళ్ళీ మాట్లాడితే ఒక్క మంచి రచననీ గుర్తుంచుకోవాలనే రూలేదీ తెలుగువాళ్ళం మనం పెట్టుకోకపోయినా, 'ఔరా! ఇంత మంచి రచన ఇంతవరకూ చూడకపోతిమే!అడ్డెడ్డే!' అనుకునేపాటి సహృదయమైనా మనలో ఇంకా మిగిలే వుందనుకుంటే 'ఆంధ్రపత్రిక ' వారి ఈ స్వర్ణోత్సవ సంచిక ఒకసారి తిరగేయాల్సిందే!వాటిలో చూడగానే కళ్ళుమెరిపించేవి కొన్నయితే, పెదాలపై చిరునవ్వు పూయించేవి మరికొన్ని.దేవీప్రసాద్ చటోపాధ్యాయగారు 1959లో ప్రకటించిన 'లోకాయత ' పుస్తకం కంటే యెంతో ముందు వేలూరి శివరామ శాస్త్రిగారు చార్వాకులమీద 1921లోనే రాసిన'నాస్తికదర్శనములు ' అనే వ్యాసం ఆశ్చర్యం కలిగించక మానదు. ఆ వెంటనే 'శంకరమతమున జగత్తు అసత్యమా?' అనే బంకుపల్లి మల్లయ్య శాస్త్రులవారి వ్యాసం (1921). ఈసంచికలోని యేకైక స్త్రీ రచన మామిడన్న కామేశ్వరమ్మగారి 1911నాటీహిందూ స్త్రీల ప్రస్తుత స్థితి ' నిజంగా ఎన్నదగ్గ రచన. ఉన్నవ లక్ష్మీనారాయణగారి 'తిక్కన '. అఫ్ కోర్స్- పానుగంటివారి వ్యాసం 'కానుగ చెట్టు '. కథలు, వ్యంగ్యరచనలు, పాటలు, పద్యాలు - యెన్నో వున్నాయిందులో. మన ఆది కార్టూనిస్టు అనదగ్గ తలిశెట్టి రామారావుగారుఅప్పటి సామాజిక స్థితిగతులపై గీసిన వ్యంగ్య చిత్రాలు - వాటిలో ఆంధ్రుడి మనస్తత్వం మీద గీసిన కార్టూన్ చూసి తీరాల్సిందే. ఔరంగజేబు తన గురువుగారికి రాసినసుప్రసిద్ధమైన లేఖ. మనకిష్టమైన సినిమాల తొలి ప్రకటనలు. అన్నట్టు 'పొట్ట చీల్చి బిడ్డను తీయుట ' అనే ఆచంట లక్ష్మీపతిగారి వైజ్ఞానిక వ్యాసం కూ​​డా ఇందులో వుంది - శ్రీ శ్రీ పుట్టిన సంవత్సరం (1910) నాటిది!
చాలా కాలం క్రితమే లక్కీగా ఈ సంచిక నాకు అంతర్జాలంలో దొరికింది. పట్టేశాను. ఇది మన 'తెలుగు పరిశోధన ' లో వుందనే అనుకున్నాను. కానీ లేదు. నా ప్రైజ్డ్ పొసెషన్,శర్మగారూ! మీకు పంపిస్తున్నాను.           

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....ఆంధ్రపత్రిక - స్వర్ణోత్సవ సంచిక Andhra Patrika Svarnotsava Sanchika


పైనొక్కండి
Categories: Other Language Links

మహీధర నళినీ మోహన్ రచనలు Writings of Mahidhara Nalini Mohan

Sun, 05/29/2016 - 18:16
మహీధర నళినీ మోహన్ రచనలు Writings of Mahidhara Nalini Mohan

మహీధర నళినీ మోహన్ గారి రచనలు ఎన్నో ఉన్నా, ఒక నాలుగు రచనలు అంతర్జాలంలో లభించాయి. అదే భాగ్యం అనిపించింది. వాటిని మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నమే ఇది.పుస్తకాలు దిగుమతికి .....

 1. చొప్పదంటు ప్రశ్నలు
 2. గణితంతో గమ్మత్తులు
 3. మెదడుకు పదును
 4. వనసీమలలో
Categories: Other Language Links

ఆత్రేయ గారి అంత్యార్పణ Antyarpana By Atreya

Sun, 05/15/2016 - 06:26

ఆత్రేయ గారి  అంత్యార్పణ Antyarpana By Atreya 

దాదా హయత్ గారు ప్రేమతో ఈ పుస్తకాన్ని పంపిస్తూ తెలిపిన మాటలు ...వారి మాటల్లోనే...

శర్మగారూ!
ఆచార్య ఆత్రేయగారి 'అంత్యార్పణ' నాటిక ఇందువెంట పంపిస్తున్నాను.
ఈ నాటిక మీరిచ్చిన 'ఎవరు దొంగ? - ఇతర నాటికలు ' లంకెలో ఇదివరకు వున్నదే. అయితే ఈ ఎడిషన్ వేరు. 'ఎవరు దొంగ?' దేశీ ప్రచురణలు. ఇప్పుడు నేనిస్తున్నది విశాలాంధ్ర ప్రచురణ. 1955 నాటి అపురూపమైన ఎడిషన్ ఇది. అంతర్జాలంలో సేకరించిందే. ఇందులో ఆత్రేయగారి చరిత్రాత్మకమైన ముందుమాట వున్నది. నటీనటవర్గం జాబితా వున్నది. భారతమ్మ పాత్ర ఆనాటి సుప్రసిద్ధ సినీనటి జి.వరలక్ష్మిగారు పోషించినట్టుగా ఈ ముందుమాటవల్ల తెలుస్తోంది. శేషయ్యగా వేసిన నాగభూషణం మన 'రక్తకన్నీరు' నాగభూషణం గారే అనుకుంటున్నాను. ఎవరో మధుసూదనరావుగారు రెండుపాత్రలు వేశారు. దురదృష్టవశాతూ ఇంటిపేర్లివ్వకపోవడంవల్ల వారు ఏ మధుసూదనరావుగారో తెలియకుండాపోయింది. ఒక సంవత్సరకాలంలోనే ఎనిమిది లక్షలమంది ప్రేక్షకులు ఈ నాటకం చూశారట. మా ప్రొద్దుటూరులో కూడా ఈ నాటకం ఆడినట్టున్నారు. ఎందుకో ఈ ముందుమాట దేశీ ప్రచురణల ఎడిషన్ లో లేదు. ఇంకా విశేషమేమిటంటే ఆత్రేయగారు స్వయంగా ఇందులో జగన్నాధం పాత్ర వేశారు. భారతమ్మగా పూర్తి నాన్-గ్లామరస్ గెటప్ లో జి.వరలక్ష్మి, జగన్నాధం పాత్రలో ఆత్రేయగారూ వున్న ఒక ఛాయాచిత్రం కూడా ఈ విశాలాంధ్రవారి ఎడిషన్ లో వుంది. అందులో ఆత్రేయగారు నిండుగా స్ఫురద్రూపిగా కనిపిస్తున్నారు. 'కోడెనాగు' సినిమాలో కనిపించిన ఆత్రేయగారికీ ఈ ఆత్రేయగారికీ చాలా తేడా వుంది. జగ్గయ్యగారు ఎంతో అభిమానం తో 'ఆత్రేయ సాహితి' ప్రకటించకపోయి వుంటే సినిమారంగం మింగేసిన మన సొంత  బెర్నార్డ్ షా ఆత్రేయగారి రచనలు అనేకం శాశ్వతంగా కనుమరుగు అయిపోయివుండేవి. ఈ ఎడిషన్ మీ వెబ్ సైటులో వుంచడానికి విశాలాంధ్రవారికి ఏమైనా అభ్యంతరాలుంటాయేమో నాకు తెలీదు. ఇది మీకు పంపించి ఆత్రేయగారి సాహితీ ఋణం తీర్చుకుంటున్నాననుకుంటున్నాను.
ఇట్లు మీ విధేయుడు,
ఎన్. దాదా హయాత్అన్నట్లు... ఎవరికయినా అభ్యంతరముంటే ఈ పుస్తకాన్ని ఇక్కడినుండి తొలగిస్తాం. లేదా తెలుగువారు ఈ పుస్తకం చదివి ఆనందింతురు గాక.

Categories: Other Language Links

జమ్మలమడుగు మాధవరామశర్మ రచనలు Writings of Jammalamadugu Madhava Rama Sharma

Tue, 05/03/2016 - 12:14
జమ్మలమడుగు మాధవరామశర్మ రచనలు Writings of Jammalamadugu Madhava Rama Sharma
సుప్రసిద్ధ పండితులు, ఎందరో కవిపండితులను తెలుగువారికందించిన గురువరేణ్యులు జమ్మలమడుగు మాధవరామశర్మగారు.

వారు తమ జీవితకాలంలో ఎందరికో పాఠాలు చెప్పడమే కాక కొన్ని గ్రంథాలకు వ్యాఖ్యానం వ్రాయడం వల్ల తెలుగు వారికి ఎంతో మేలు చేసారు. వారి గ్రంథాలను లభించిన వాటిని ఇక్కడ సంగ్రహిస్తున్నాము. ఎంకేవైనా గ్రంథాలు లభిస్తే, సందర్శకులు లంకెలను సూచి స్తే ఇక్కడ ప్రకటిస్తాము.
 1. నవరసగంగాధరము .
 2. రసగంగాధరమణి
 3. కావ్య ప్రకాశము
 4. భావప్రకాశనము
 5. సరస్వతీ సామ్రాజ్యం
 6. శ్రీ
Categories: Other Language Links

విష్ణుమాయా విలాసము Vishnu maya Vilasamu of Kankanti Papi Raju

Mon, 05/02/2016 - 09:36
విష్ణుమాయా విలాసము    Vishnu maya Vilasamu of  Kankanti Papi Raju


గతంలో తెలుగు పరిశోధన కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణాన్ని ప్రకటించింది. ఇక ఇప్పుడు అతని మరొక కృతి విష్ణుమాయావిలాసము ను కూడా ప్రకటించి, కవి ఋణాన్ని, భాషా సాహిత్య ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది మీ తెలుగు పరిశోధన.దీనిని దిగుమతి చేసుకో దల్చిన పాఠకులు ........

విష్ణుమాయా విలాసము   
పై నొక్కండి.
Categories: Other Language Links

ఆత్రేయ రచనలు Writings of Atreya

Sun, 04/24/2016 - 10:00
ఆత్రేయ రచనలు Writings of  Atreya


మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి రచనలను డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా లో లభిస్తున్నవాటిని మీ దృష్టికి తెస్తున్నాం.

మీకు కావాల్సిన పుస్తకం పేరుపై నొక్కండి. అది దిగుమతి పుటకు తీసుకు వేళుతుంది. దిగుమతి చేసుకోండి. అన్నట్టు ఈ పుటను మీ సాంఘిక సంపర్క జాలాల్లో పంచుకోండి.
 1. ఆత్రేయ సాహితి -1
 2. ఆత్రేయ సాహితి -2
 3. ఆత్రేయ సాహితి - 7
 4. ఎవరు దొంగ - నాటిక
 5. విశ్వశాంతి
అన్నట్టు మరో మాట -  మీకు ఇంకెక్కడైనా ఆత్రేయ సాహితి లభిస్తే మాతో పంచుకోండి. పదిమందితో పంచుకుందాం."సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యమ్ కరవావహై" అని కదా ఆరోక్తి.


Categories: Other Language Links

వేదము వేంకటరాయ శాస్త్రి రచనలు Writings of Vedam Venkata Raya Shastri

Fri, 04/22/2016 - 22:00
వేదము వేంకటరాయ శాస్త్రి రచనలు Writings of Vedam Venkata Raya Shastri

సుప్రసిద్ధ పండితులు వేదం వేంకటరాయ శాస్త్రి గారి రచనలను డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా లో లభిస్తున్న వానిని మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది తెలుగుపరిశోధన. పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి.దిగుమతి కొరకు ఆయా శిర్షికలపై నొక్కండి.

 1. ఆముక్తమాల్యద - సంజీవినీ వ్యాఖ్య
 2. శతక వాఙ్మయ చరిత్ర - ప్రథమ సంపుటం
 3. చరిత్ర రచన - ప్రథమ భాగం
 4. తెనుగు లఘు వ్యాకరణము
 5. వ్యామోహము
 6. వేదం వేంకటరాయ శాస్త్రి గారి జీవితచరిత్ర సంగ్రహము
 7. నాగానంద నాటకము
 8. భరతాభారత రూపక మర్యాదలు
 9. ప్రతాపరుద్రీయ నాటకము
 10. ప్రియదర్శికా నాటిక
 11. బొబ్బిలి యుద్ధ నాటకము
 12. అమర కావ్యం
 13. ఆంధ్ర హితోపదేశము - చంపువు
 14. ఉత్తర రామ చరిత నాటకము
 15. శ్రీ శారదా కాంచిక
 16. ఆంధ్ర విక్రమోర్వశీయ నాటకము
 17. ఆంధ్ర బిల్హణియము
 18. విక్రమార్క చరిత్రము
 19. కావ్యాలంకార చూడామణి
 20. మేఘ సందేశం వ్యాఖ్యానం
 21. ఉదయన చరిత్రము
 22. ఆంధ్ర సాహిత్య దర్పణము


Categories: Other Language Links

దాశరథి రచనలు Dasharathi Rachanalu

Sat, 04/16/2016 - 10:00
దాశరథి రచనలు Dasharathi Rachanalu


దాశరథి కృష్ణమాచార్యుల వారి రచనలను అంతర్జాలంలో లభిస్తున్నవాటినన్నిటిని ఒక్కదగ్గర చేర్చి అందించే ప్రయత్నం చేస్తున్నాము.

దిగుమతికై ఆయా శీర్షికపై నొక్కండి.
 1. మహాంధ్రోదయం
 2.  ధ్వజమెత్తిన ప్రజ
 3. ఆలోచనాలోచనాలు
 4. గాలీబ్ గీతాలు
 5. జ్వాలాలేఖిని
 6. అమృతాభిషేకము
 7. అగ్నిధార
 8. మహాబోధి
మీ అభిప్రాయాలను వ్యాఖ్యా రూపంలో వ్రాయండి.

Categories: Other Language Links

దాశరథి రంగాచార్యుల రచనలు Dasharathi Ranga Acharya Rachanalu

Fri, 04/15/2016 - 08:32
దాశరథి రంగాచార్యుల రచనలు Dasharathi Ranga Acharya Rachanalu
దాశరథి రంగాచార్యుల రచనలను అంతర్జాలంలో లభించిన వాటిని ఒక్కదగ్గర చేర్చి, మీ ముందుకు తెస్తుంది తెలుగు పరిశోధన. ఆయా పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి. 1. దాశరథి రంగాచార్యుల రచనలు -1 
 2. దాశరథి రంగాచార్యుల రచనలు -2
 3. దాశరథి రంగాచార్యుల రచనలు - 7
 4. జీవనయానం - గడచిన గురుతులు
 5. రణభేరి
అన్నట్లు మరవకండి....ఈ టపాను మీ సాంఘికసంపర్క జాలాల్లో,బ్లాగుల్లో ప్రస్తావించడం.
Categories: Other Language Links

చర్ల గణపతి శాస్త్రి రచనలు Charla Ganapathi Shastri Rachnalu

Thu, 04/14/2016 - 12:20
చర్ల గణపతి శాస్త్రి రచనలు Charla Ganapathi Shastri Rachnalu

చర్ల గణపతి శాస్త్రిగారి రచనలన్నింటినీ ఒకే దగ్గర మనకోసం సమకూర్చి పెట్టారు చర్ల మృదుల గారు వారి ప్రత్యేకమైన charla.in  అనే వెబ్ సైట్ ద్వారా. దాదాపు తొంబదికి పైగా ఉన్నవారి గ్రంథాలను దిగుమతి చేసుకుని తరించండి.ఆ వెబ్ సైట్ నే ఇక్కడ మీ ముందు ప్రదర్శిస్తున్నాము.

Error: Embedded data could not be displayed.
Categories: Other Language Links

కరీం నగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర Karim Nagar Jilla Telugu sahithya charitra

Mon, 04/04/2016 - 09:01
కరీం నగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర Karim Nagar Jilla Telugu sahithya charitraడా.మలయశ్రీ  Dr.malayashree
డాక్టర్ మలయశ్రీ గారు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి Ph.D. పట్టం పొందేందుకు వ్రాసిన సిద్ధాంత వ్యాస గ్రంథం. ఇది వెయ్యేళ్ళ జిల్లా సాహిత్య చరిత్ర. ఇందులో ఎందరో కవులగురించి శోధించి వెలికి తెచ్చారు. 

ఇటువంటి సిద్ధాంతగ్రంథాలు, పరిశోధనలు మరిన్ని తెలుగుభాషా సాహిత్యాల్లో రావాలి. ప్రతి జిల్లా సాహిత్య చరిత్ర, భాషా చరిత్రలపై సమగ్ర పరిశోధనలు జరగాలి. మన తెలుగుభాష పరిపుష్టం కావాలి.

Karimnagarjilla Telugu Sahitya Charitra by Dr.Pandu Ranga Sharma Ramaka


దిగుమతి కొరకు ........
    కరీం నగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర
Categories: Other Language Links

తిక్కన భారతము రస పోషణము Tikkana Bharatamu Rasa Poshanamu

Sun, 04/03/2016 - 12:40
తిక్కన భారతము రస పోషణము Tikkana Bharatamu Rasa Poshanamuడా.ఆండ్ర కమలా దేవి Dr.Andra Kamala Devi
డా.ఆండ్ర కమలాదేవి గారు ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి Ph.D. పట్టం పొందడం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది.ఇక్కడే చదువుకోవాలంటే ........


Tikkana bharathamu - rasaposhanamu by Dr.Pandu Ranga Sharma Ramaka

దిగుమతి చేసుకోవాలంటే .........

 తిక్కన భారతము రస పోషణముపై నొక్కండి.
Categories: Other Language Links

రంగనాథ రామాయణము Ranganatha Ramayanamu

Wed, 03/30/2016 - 05:54
రంగనాథ రామాయణముగోన బుద్ధా రెడ్డి Ranganatha RamayanamuGona Buddha Reddy
గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు. మరియు చాల తెలివి గల వ్యక్తి 
దిగుమతి కొరకు .........
రంగనాథ రామాయణము Ranganatha Ramayanamu
పై నొక్కండి.


Categories: Other Language Links

ఆంధ్ర కవుల చరిత్రము Andhra Kavula Charitramu (Complete)

Sat, 03/19/2016 - 10:00
ఆంధ్ర కవుల చరిత్రము (సమగ్రం) Andhra Kavula Charitramu (3 Parts)కందుకూరి వీరేశలింగం Kandukuri Veeresha lingam

ఆంధ్ర కవుల చరిత్రము కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన పుస్తకము. ఇది మూడు భాగాలుగా వివిధ కాలాల్లో ముద్రించబడినది. ఇందులోని మొదటి భాగములో సుమారు 40 మంది ప్రాచీన తెలుగు కవుల గురించి విస్తృతంగా వివరించారు. రెండవభాగములో సుమారు 50-60 మంది మధ్యకాలపు తెలుగు కవుల జీవితచరిత్రలను చిత్రీకరించారు. మూడవ భాగములో సుమారు 140 మంది ఆధునికకాలపు తెలుగు కవుల జీవితాలను టూకీగా పేర్కొన్నారు. ఈ మూడింటిని హితకారిణీ సమాజము, రాజమండ్రి వారు ముద్రించారు.
దిగుమతికొరకు --ఆంధ్ర కవుల చరిత్రము Andhra Kavula Charitramu (Complete)

Categories: Other Language Links

ప్రజాకవి వేమన Praja Kavi Vemana - Dr.N.Gopi

Fri, 03/18/2016 - 10:00
డా.యన్.గోపి ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం కొరకు సమ్ర్పించిన సిద్ధాంత గ్రంథం. ఎన్నో ఏళ్ళుగా విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంప్రదింపుగ్రంథంగా ఉన్న విశిష్ట రచన.
దీనిని మనకు సాయిభక్తులు సాయి రియల్ ఆటిట్యూడ్ వారు అందిస్తున్నారు.
దిగుమతి కొరకు .........
ప్రజాకవి వేమన Praja Kavi Vemana - Dr.N.Gopi


Categories: Other Language Links

మహర్షుల చరిత్రలు MaharShula charitralu (1-7 Parts)

Thu, 03/17/2016 - 19:00
విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు రచించిన ఈ మహర్షుల చరిత్రలు అనే గ్రంథాన్ని తి.తి.దే. వారు ఏడు భాగాలుగా ప్రచురించారు. వాటిని అన్నింటిని ఒక్కదగ్గర చేర్చి సాయి భక్తులు మనకు అందిస్తున్నారు.


భారతీయ విజ్ఞానానికి మూలకందాలైన మర్షుల జీవిత చరిత్రలు భారతీయులందరూ చదువాలి. వారి గురించి తెలుసుకోవడం మన భాగ్యం.

దిగుమతి కొరకు ..........

మహర్షుల చరిత్రలు MaharShula charitralu (1-7 Parts)
Categories: Other Language Links

సన్నిధానం వారి రచనలు Sannidhanam Rachanalu

Wed, 03/16/2016 - 07:06
సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి గ్రంథాలను అంతర్జాలంలో లభించిన వాటినన్నింటిని ఒక్కచోట చేర్చి అందించాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నమే ఈ సన్నిధానం వారి రచనలు. ప్రస్తుతం లభిస్తున్నవాటిని ప్రకటిస్తున్నాం. ఇంకా ఏవైనా పుస్తకాల లంకెలను ఎవరైనా అందిస్తే వాటినీ అందిస్తాం.
ప్రస్తుతం లభిస్తున్న పుస్తకాలు............


 1. జాతక కథా గుచ్ఛము
 2. ఖడ్గ తిక్కన
 3. నడమంత్రపు సిరి
 4. తత్సమ చంద్రిక
 5. వాసవదత్త
 6. వివేకానందము
 7. జానకీ పరిణయము
 8. స్మర గీత
వ్యాఖ్యలు రాయడం, సాంఘిక సంపర్కజాలాల్లో చర్చించడం మరవకండి. మా సేవకు మాతో సహకరించండి.
Categories: Other Language Links

Pages