Telugu Thesis

Subscribe to Telugu Thesis feed
తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే తెలుగు గ్రంథాలయం Download Telugu Books and Sanskrit books Freepandurangasharma ramakahttps://plus.google.com/107603709554796853189noreply@blogger.comBlogger314125
Updated: 5 hours 31 min ago

మహర్షుల చరిత్రలు MaharShula charitralu (1-7 Parts)

Thu, 03/17/2016 - 19:00
విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు రచించిన ఈ మహర్షుల చరిత్రలు అనే గ్రంథాన్ని తి.తి.దే. వారు ఏడు భాగాలుగా ప్రచురించారు. వాటిని అన్నింటిని ఒక్కదగ్గర చేర్చి సాయి భక్తులు మనకు అందిస్తున్నారు.


భారతీయ విజ్ఞానానికి మూలకందాలైన మర్షుల జీవిత చరిత్రలు భారతీయులందరూ చదువాలి. వారి గురించి తెలుసుకోవడం మన భాగ్యం.

దిగుమతి కొరకు ..........

మహర్షుల చరిత్రలు MaharShula charitralu (1-7 Parts)
Categories: Other Language Links

సన్నిధానం వారి రచనలు Sannidhanam Rachanalu

Wed, 03/16/2016 - 07:06
సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి గ్రంథాలను అంతర్జాలంలో లభించిన వాటినన్నింటిని ఒక్కచోట చేర్చి అందించాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నమే ఈ సన్నిధానం వారి రచనలు. ప్రస్తుతం లభిస్తున్నవాటిని ప్రకటిస్తున్నాం. ఇంకా ఏవైనా పుస్తకాల లంకెలను ఎవరైనా అందిస్తే వాటినీ అందిస్తాం.
ప్రస్తుతం లభిస్తున్న పుస్తకాలు............


 1. జాతక కథా గుచ్ఛము
 2. ఖడ్గ తిక్కన
 3. నడమంత్రపు సిరి
 4. తత్సమ చంద్రిక
 5. వాసవదత్త
 6. వివేకానందము
 7. జానకీ పరిణయము
 8. స్మర గీత
వ్యాఖ్యలు రాయడం, సాంఘిక సంపర్కజాలాల్లో చర్చించడం మరవకండి. మా సేవకు మాతో సహకరించండి.
Categories: Other Language Links

శ్రీనాథ భాషా పరిశీలనము Shreenatha Bhasha Parisheelanamu

Mon, 03/14/2016 - 21:38
శ్రీనాథ భాషా పరిశీలనము Shreenatha Bhasha Parisheelanamuనేతి అనంతరామ శాస్త్రి గారు Nethi Anantha Rama Shastri

శ్రీ నేతి అనంతరామ శాస్త్రి గారు నాగార్జున విశ్వవిద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం. దీనికి బంగారు పతకం కూడా లభించింది. ఈ గ్రంథాన్ని దిగుమతి చేసుకొని చదివి ఆనందించండి.

దిగుమతి కొరకు -

శ్రీనాథ భాషా పరిశీలనము Shreenatha Bhasha Parisheelanamu
    ......... పై నొక్కండి.
(సాయి రియల్ ఆటిట్యూడ్ వారి సౌజన్యంతో...)
Categories: Other Language Links

తెలుగులో యాత్రా చరిత్రలు Telugulo Yatra charitralu

Thu, 03/10/2016 - 17:48
మచ్చ హరిదాసు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమే తెలుగులో యాత్రా చరిత్రలు. ఇందులో తెలుగులో వెలువడిన యాత్రా చరిత్రలు చక్కగా సేకరించి,వివరించారు. మంచి సమాచారం ఉంది.


TeluguloYaatraacharitralu - తెలుగులో యాత్రా చరిత్రలు by Dr.Pandu Ranga Sharma Ramaka

దిగుమతికి కింది లంకె పై నొక్కండి.
తెలుగులో యాత్రా చరిత్రలు Telugulo Yatra charitralu
Categories: Other Language Links

ఆంధ్రానంద రామాయణం Andhra Ananda Ramayanam

Sun, 03/06/2016 - 08:57
గుండు లక్ష్మణ శాస్త్రి గారిచే వ్రాయబడిన ఈ ఆనంద రామాయణము తెలుగు వారికి మరుగున పడినట్లైనది.ఇదొక అపురూప కావ్యం. సంస్కృతంలోని ఆనందరామాయణానికి ఇది అనువాదమో కాదో తెలీదు. కానీ, రసనిర్భరము. చదివి ఆనందించండి.


దిగుమతి కొరకు ..........

     ఆంధ్రానంద రామాయణం Andhra Ananda Ramayanam


Categories: Other Language Links

ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu

Thu, 03/03/2016 - 20:34
ఆంధ్ర వాచస్పత్యముకొట్ర శ్యామల కామ శాస్త్రి Andhra VachaspathyamuKotra Shyamala Kama Shastry
కొట్ర శ్యామల కామశాస్త్రిగారు రచించిన బృహత్తర నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము. దానిని సమగ్రంగా అందించే భాగ్యం తెలుగు పరిశోధన వారికి కలిగింది. దీనికొరకు పాఠకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. దిగుమతి చేసుకుని, ఆనందించండి.

దిగుమతి కొరకు కింది లంకెలపై నొక్కండి.
 1. ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu 1
 2. ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu  2
 3. ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu  3
 4. ఆంధ్ర వాచస్పత్యము Andhra Vachaspathyamu  4
అన్నట్టు, మీరేం మర్చిపోరు కాని......అదే....వ్యాఖ్యలు వ్రాయడం, సాంఘిక సంపర్కజాలాల్లో పంచుకోవడం.....ధన్యవాదాలు.

Categories: Other Language Links

వానమామలై రచనలు Vanamamalai Rachanalu

Mon, 02/29/2016 - 19:34
డా. వానమామలై వరదాచార్యులు  గారు రచించిన పుస్తకాలు అంతర్జాలంలో లభిస్తున్నవాటిని సేకరించి మీ ముందుకి తెస్తుంది తెలుగుపరిశోధన. ఆనందించంచండి.
 1. పోతన చరిత్రము
 2. ఆవాహనము
 3. శ్రీ సత్యనారాయణ వ్రత కల్పము
 4. స్తవరాజ పంచశతి
 5. వైశాలిని
 6. మణిమాల


Categories: Other Language Links

ప్రథమాంధ్ర మహా పురాణము Prathama Andhra Maha Puranamu

Wed, 02/10/2016 - 09:30
జి.వి.సుబ్రహ్మణ్యం గారిప్రథమాంధ్ర మహా పురాణము Prathama Andhra Maha PuranamuByG.V.Subrahmanyam

తెలుగులో వెలువడిన మొట్టమొదటి పురాణం మారన రాసిన మార్కండేయ పురాణం. దానిని పరిశోధించే నెపంతో సుబ్రహ్మణ్యంగారు తెలుగులో పురాణాల పుట్టు పూర్వోత్తరాలను చక్కగా పరామర్శించారు. తెలుగు సాహితీ పిపాసకులకు చక్కని పరామర్శ గ్రంథమిది.  ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం.


ఇక్కడే చదువుకోవాలంటే .........

Error: Embedded data could not be displayed.
దిగుమతి చేసుకోవాలంటే నొక్కండి ............
           ప్రథమాంధ్ర మహా పురాణముపై.ఇదీ చూడండి......పురాణ వాఙ్మయము
Categories: Other Language Links

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం ( మందరము) Mandaramu Vavikolanu Subba Rao

Sun, 02/07/2016 - 09:30
వావికొలను సుబ్బారావుగారు రచించిన మందరము తెలుగువారికి నిజంగా రామాయణ విషయ విశేష మందారమే. దీనికి వారు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అనే పేరు పెట్టినా మందరము గానే ప్రసిద్ధమిది. శ్రీ భక్తి సంజీవని వారు అందించే ప్రయత్నం చేసారు. సాయి రియల్ ఆటిట్యూడ్ వారు కూడా ఆ ప్రయత్నమే చేసారు. ఇప్పటికీ ఇంకా మనం దిగుమతి చేసుకోకుంటే ఎలా? చదువకుంటే ఎలా?


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం ( మందరము)

 1. బాలకాండ                           లంకె 1         లంకె 2
 2. అయోధ్యాకాండ                 లంకె 1         లంకె 2
 3. అరణ్యకాండ                      లంకె 1         లంకె 2
 4. కిష్కింధ కాండ                  లంకె 1         లంకె 2
 5. సుందర కాండ                   లంకె 1         లంకె 2
 6. యుద్ధకాండ                       లంకె 1         లంకె 2
 7. ఉత్తర కాండ                       లంకె 1         లంకె 2

రెండవ లంకెలు సాయి రియల్ ఆటిట్యూడ్ వారివి. అందుబాటులో ఉన్న లంకెలు అందించాము. మిగిలినవాటిని వారు అందించగానే అందిస్తాం.

Categories: Other Language Links

పోతన చరిత్రము(వానమామలై వరదాచార్యులు) Potana Charitramu (Vanamamalai Varada acharyulu)

Sat, 02/06/2016 - 23:01
వానమామలై వరదాచార్యులు గారు రచించిన పోతన చరిత్రము అనే అద్భుత గ్రంథాన్ని మీకు అందించే భాగ్యాన్ని తెలుగు పరిశోధన పొందింది.
దిగుమతి కొరకు ..........

పోతన చరిత్రము(వానమామలై వరదాచార్యులు) 

Categories: Other Language Links

తెలుగు సాహిత్య కోశము Telugu Sahitya Koshamu

Sun, 01/31/2016 - 21:57

నల్లపాటి శివనారయ్యగారు సంపాదించిన (ప్రాచీన) తెలుగు సాహిత్య కోశము మీకు అందిస్తున్నాము.


37649698 Telugu Sahitya Kosamu 1 Ok

దిగుమతి కొరకు


తెలుగు సాహిత్య కోశము Telugu Sahitya Koshamu
పై నొక్కండి.
Categories: Other Language Links

రావూరి భరద్వాజ రచనలు Ravuri Bharadwaja Rachanalu

Wed, 01/27/2016 - 21:36
ఇంతకు ముందు జ్ఞానపీఠ పురస్కారాన్ని రావూరి భరద్వాజగారు పొందిన సందర్భంగా అభినందిస్తూ ప్రకటించిన టపాలో కొన్ని వారి రచనలను పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మాకు అంతర్జాలంలో లభించిన పుస్తకాలననన్నిటిని ఒక్క దగ్గర చేర్చి ప్రకటిస్తున్నాము.
 1. పాకుడురాళ్ళు
 2. లోకం కోసం
 3. ఉన్నదీ ఊహించేది
 4. పద్మవ్యూహం
 5. జయంతి
 6. భక్త కబీర్
 7. మమకారం
 8. కరిమింగిన వెలగపండు
Categories: Other Language Links

కావ్యాలంకార సంగ్రహము (నరసభూపాలీయము) kavyalamkara sangrahamu (Narasa bhupaliyam)

Mon, 01/25/2016 - 10:00
కావ్యాలంకార సంగ్రహము (నరసభూపాలీయము)  kavyalamkara sangrahamu (Narasa bhupaliyam)రామరాజభూషణుడు Ramaraja Bhushana
తెలుగులో వెలువడిన అలంకారశాస్త్ర గ్రంథమిది.  
 ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి. మీరు ఆన్ లైన్ లోనే చదువుకోవాలంటే ఇక్కడే క్రింద చదవండి.......... Error: Embedded data could not be displayed.


మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......

కావ్యాలంకార సంగ్రహము (నరసభూపాలీయము)Categories: Other Language Links

పురాణ నామ చంద్రిక Purana Nama Chandrika

Sun, 01/24/2016 - 11:48
పూర్వగాధాలహరి ప్రసిద్ధమైన పూర్వ కథా గ్రంథం. అందులో మన పురాణాల్లోని వివిధ పాత్రలు,స్థలాలు మొదలైన వాని పేర్లు, వాని విశేషాలూ ఉంటాయి. అటువంటివే ఈ పురాణ నామ చంద్రిక, పురాణ నామ సంగ్రహము.

Purana Nama Chandrika

ఈ గ్రంథాలు విద్యార్థులకు,ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపకరిస్తాయి.
పురాణ నామ చంద్రిక
పురాణ నామ సంగ్రహము
Categories: Other Language Links

ఆరుద్ర రచనలు Writings of Arudra

Wed, 01/20/2016 - 10:00
ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.


వారి రచనలను అంతర్జాలంలో లభిస్తున్నవాటిని సంగ్రహించి, తెలుగుపరిశోధన అందిస్తుంది.
దిగుమతికొరకు ఆయా పుస్తకాల పేర్లపై నొక్కండి. నేరుగా ఆ పుస్తకం దిగుమతి అవుతుంది.

 1. ఆధునిక విజ్ఞానము - అవగాహన
 2. నవ్వుల నదిలో పువ్వుల నావ (సినీగీతాలు 3)
 3. కురిసే చిరు జల్లుల్లో (సినీగీతాలు 5)
 4. ఆరుద్ర కవితలు 
 5. ఆరుద్ర వ్యాసపీఠం
 6. కాటమరాజు కథ (స్టేజి నాటకం)
 7. మన వేమన
 8. రామునికి సీత ఏమవుతుంది?
అన్నట్టు.....వ్యాఖ్యలు వ్రాయడం, సాంఘిక సంపర్కజాలాల్లో చర్చించడం చేయండి...మరచిపోకండేం.......?

Categories: Other Language Links

సురవరం ప్రతాపరెడ్డి రచనలు Suravaram Prathapa Reddy Rachanalu

Tue, 01/19/2016 - 10:00
సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు లో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించాడు. మంచిపండితుడు1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రికసంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు.

ఆయన రచనలని తెలుగువారికి అందించే ప్రయత్నమే ఇది.


 1. రామాయణ విశేషము
 2. మొగులాయి కథలు 2
 3. ప్రాథమిక స్వత్వము
 4. సురవరం ప్రతాప రెడ్డి వ్యాసాలు
 5. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు
 6. ఉచ్చల  విషాదము
 7. యువజన విజ్ఞానము
 8. భక్త తుకారాం
 9. ప్రజాధికారములు
Categories: Other Language Links

ఆంధ్రుల సాంఘిక చరిత్ర Andhrula Sanghika Charitra

Mon, 01/18/2016 - 10:14
ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని ప్రముఖ సంపాదకుడు, చరిత్ర కారుడు, రచయిత సురవరం ప్రతాపరెడ్డి సుమారు 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధన చేసి రచించాడు. రెండు వేలయేళ్ళుగా వివిధ సాహిత్య ఆకరాలను ఆధారం చేసుకుని కొంతవరకూ పురావస్తువులతో సరిచూసుకుని రచించిన సాంఘిక చరిత్ర ఇది. రాజుల చరిత్ర కాక ప్రజల చరిత్రకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది.
Andhrula Sanghika charitrabySuravaram Pratapa Reddyఈ అపురూపమైన పరిశోధనా గ్రంథాన్ని దిగుమతి చేసుకుని, చదువుకొని, ఆనందించండి.
దిగుమతి కొరకు ............
ఆంధ్రుల సాంఘిక చరిత్ర Andhrula Sanghika Charitra

Categories: Other Language Links

గోల్కొండ కవుల సంచిక Golkonda Kavula Sanchika

Sun, 01/17/2016 - 09:00
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 281896 - ఆగస్టు 251953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. 
      దిగుమతి కొరకు ..........
గోల్కొండ కవుల సంచిక Golkonda Kavula Sanchika
పై నొక్కండి.
ఇవీ చూడండి...........1. Discover-telangana-golkonda_kavula_sanchika2.Dr.ఆచార్య ఫణీంద్ర - గోల్కొండ కవుల సంచికలో3.సురవరం ప్రతాపరెడ్డి - వికీపీడియ


Categories: Other Language Links

సాక్షి వ్యాస సంపుటి-పానుగంటి Sakshi by Panuganti

Sat, 01/16/2016 - 13:24
సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. 
తెలుగు మాతృభాష గల వారు కూడ అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడ కొంత వినోదపూర్వక భావంతోనే వ్రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 1913 - 1933 మధ్య కాలంలో వెలువడినాయి. 1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసినస్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందిన పానుగంటి స్పెక్టేటర్ క్లబ్ తరహాలో సాక్షి సంఘం అని పేరుపెట్టాడు.

దిగుమతి లంకెలు ........
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము 1  Panganti Sakshi  1
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము 2  Panganti Sakshi  2 (ప్రస్తుతం లభించడం లేదు)
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము 3  Panganti Sakshi  3
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము 4  Panganti Sakshi  4
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము  5 Panganti Sakshi  5
పానుగంటి సాక్షి వ్యాస సంపుటి - భాగము  6 Panganti Sakshi  6

మరిన్ని వివరాలకు  సాక్షివ్యాసాలు వికీ పుట చూడండి
Categories: Other Language Links

ఆరుద్ర నాటికలు Arudra Natikalu

Fri, 01/15/2016 - 11:46
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవిశ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 311925 - జూన్ 41998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.[1][2] ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.
ఆరుద్ర రచించిన ఏడు నాటికల సంపుటి ఈ పుస్తకం మీ ముందుకు తెస్తున్నాం.


దిగుమతి కొరకు........


ఆరుద్ర నాటికలు Arudra Natikalu
Categories: Other Language Links

Pages